NLG: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏడాది కాలానికి కొబ్బరికాయలను విక్రయించే హక్కుల కోసం టెండర్‌కు బహిరంగ వేలాన్ని ఈ నెల 30న నల్గొండ ఎండోమెంట్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య శనివారం తెలిపారు. దర్వేశీపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ఈవో పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీని తీసి అందజేయాలన్నారు.