కృష్ణా: గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్బాద్ – అలప్పుజ ఎక్స్ప్రెస్ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ ట్రైన్ ఈ నెల 30, 31, జనవరి 2, 3, 4 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాకుండా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుతుందన్నారు.