గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.