ELR: చింతలపూడిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన డబ్బులు – మన లెక్కలు’ అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే సొంగా రోషన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ- నారీలు, వీవోఏలు, వీవో ఈసీ సభ్యులకు ఆర్థిక నిర్వహణ, పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.