W.G: ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ (Teacher Eligibility Test) పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షల కోసం ఇప్పటికే పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులు పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు.