KKD: శంఖవరం మండలం కత్తిపూడి ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో వేచి ఉండే ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. మండలంలోని కొంతంగి కొత్తూరు జనసేన పార్టీ నాయకుడు గొర్లి నాగేశ్వరరావు నేతృత్వంలో కాకినాడలోని ఎంపీని కలిసి ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్ల సౌకర్యాలు ఏమాత్రం బాగోలేదని తెలిపారు.