E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శనివారం అనంతపురంలో జరగబోయే కార్యక్రమం ఏర్పాట్లు నిమిత్తం బయలుదేరారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు.