కోనసీమ: పుస్తకాలు చేత పట్టి చదువుకోవాల్సిన పిల్లలు ప్లకార్డులు చేత పట్టి ఉద్యమ బాటపడుతున్నారు. సోమవారం మండపేట సప్తగిరి థియేటర్ వద్ధ ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు తక్షణం తొలగించాలని మహిళలు చేస్తున్న ఆందోళనకు మేము సైతం అంటూ.. “మద్యం షాపు మాకు వద్దు” అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.