W.G: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 28న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.