విజయనగరం: బొబ్బిలి మండలం కృపావలసకు చెందిన గిరిజన విద్యార్థిని తాడంగి పల్లవి (11) అనారోగ్యంతో ఈనెల 12న విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పల్లవి సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చి అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం మృతి చెందింది. మృతి విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.