W.G: వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను నియమించింది. ఇందులో భాగంగా వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీగా పాలకొల్లుకు చెందిన ఈరంకి కాశీ విశ్వనాథం నియమితులయ్యారు. గతంలో ఆయన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు.