NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ బుధవారం స్థానిక రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు నాణ్యతతో పూర్తిచేసి మార్గాన్ని ప్రజా రవాణాకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.