BPT: తుఫాను నుంచి బాపట్ల జిల్లాను రక్షించడంలో కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ కీలకపాత్ర పోషించారు. తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగాన్ని వీరిద్దరూ సమర్థంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా విజయవంతంగా నివారించగలిగారు. వీరి ముందుచూపు, సమయస్ఫూర్తితో కూడిన నిర్వహణకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.