W.G: కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్స్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుంచి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్, ఇలియాస్ పాల్గొన్నారు.