VZM: నేర నియంత్రణలో మహిళా సంరక్షణ పోలీసులు, సిబ్బంది పాత్ర కీలకమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం గుర్ల పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో నూతన సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సీఐలు పాల్గొన్నారు.