NLR: నగరంలోని వీఆర్సీ మైదానం భక్తి భావంతో ఉప్పొంగింది. ఆధ్యాత్మిక శోభతో పులకించింది. శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం సాగింది. ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ నృత్యాలతో సభా ప్రాంగణంలో ఆధ్యాత్మికతను పెంపొందించారు.