BPT: వేటపాలెం పంచాయతీ కార్యదర్శిగా బలిగా సురేంద్రబాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో రామన్నపేట పంచాయతీ సెక్రటరీగా పని చేశారు. సురేంద్రబాబు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజలు గ్రామంలో శానిటేషన్, మంచినీరు పరంగా ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని సురేంద్రబాబు తెలియజేశారు.