VZM: కొత్తవలస అండర్ గ్రౌండ్ వద్ద వర్షం లేకపోయినా నీరు నిలిచిపోతుందని శుక్రవారం ఉదయం హిట్ టీవీలో ప్రచురితమైన కథనానికి రైల్వే అధికారులు స్పందించి నీరును మోటర్లతో తోడించారు. సమస్యను పరిష్కరించడంతో నడకదారిన వెళ్ళేవారు, హైస్కూల్‌కు వెళ్ళే విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు శాశ్వత పరిష్కారం చూపాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.