KDP: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ “మాయ క్యాలెండర్”గా విమర్శించారు. కేవలం 10 వేల ఉద్యోగాల ప్రకటనతో యువతను మోసం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. యువత హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.