NTR: జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో ‘వాహన మిత్ర ఆటో ర్యాలీ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు భరోసా,గౌరవం, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తోంది అని ఆయన తెలిపారు.