ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీకి డాక్టర్ జగదీష్ నాయక్ రెండవ వైద్యాధికారిగా నియమితులయ్యారు. ఈమేరకు ఆయన శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. పీహెచ్సీ పరిధిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించి, ప్రజలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. సీహెచ్వో ప్రశాంత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు