W.G: ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే జీవన ప్రగతి సాధించగలరని కలవపూడి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డా.దాసరి సునీత పేర్కొన్నారు. కాళ్ల మండలం కోపల్లే గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన వైద్య శిబిరంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న వైద్య సహాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు.