ఏలూరు జిల్లాలో ప్రస్తుత ప్రభుత్వ సమయంలో నిర్మించిన 15,024 గృహముల గృహ ప్రవేశ కార్యక్రమం రేపు గురువారం అన్ని నియోజకవర్గాలలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన గృహాలకు లబ్ధిదారులకు మంజూరు పత్రములు అందజేయడం, కొత్త ఇళ్ల కేటాయింపునకు రిజిస్టేషన్ ప్రక్రియ కూడా సచివాలయాల్లో చేస్తారన్నారు