AKP: దోమలను నియంత్రించినప్పుడే మలేరియాను నిర్మూలించవచ్చునని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఇవాళ అనకాపల్లి గాంధీ నగరంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి ఆయన అవగాహన సదస్సును నిర్వహించారు. మలేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని అన్నారు.