CTR: పుత్తూరు పట్టణ ప్రజలకు సౌకర్యంగా మార్కెట్ యార్డ్లో కూరగాయల వారపు సంతను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. వ్యాపారులకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా సంత నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరలకే కూరగాయలు లభించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.