E.G: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం చాగల్లు నుంచి లక్ష్మిపురం వరకు సుమారు రూ.4 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.