SS: నంబులపూలకుంట మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. మొక్కజొన్న, మామిడి తోటలు దెబ్బతిని నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలని అక్కడే ఉన్న వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు.