E.G: చర్చ్లకు వెళ్లే దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ హోదా రద్దు అవుతుందనే సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు న్యాయవాది పెరికే వరప్రసాద్ అన్నారు. సోమవారం నిడదవోలులో దళిత, క్రైస్తవ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల హక్కులను హరించే సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని అన్నారు.