AKP: గొర్రెలు, మేకల్లో పారుడు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చిట్టినాయుడు సూచించారు. చీడికాడ మండలం జైతవరం గ్రామంలో గురువారం గొర్రెలు, మేకలకు పారుడు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. గొర్రెలు, మేకల ఆరోగ్యంపై పెంపకం దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వాటికి వ్యాధులు సోకితే సకాలంలో చికిత్స చేయించాలన్నారు.