ELR: చింతలపూడి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పేకాట, కోడి పందాల స్థావరాలపై సీఐ క్రాంతి కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. 32 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 30,180 నగదు, 20 మోటార్ సైకిల్, 14 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.