BPT: చీరాల TDP క్యాంప్ కార్యాలయం నందు సీఎం సహాయనిధి (CMRF) నుంచి 105 మంది లబ్ధిదారులకు రూ. 64,38,468 విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని బాధితులకు చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గంలో 921 మందికి రూ. 8.35 కోట్ల సహాయం అందించామని తెలిపారు.