Atchannaidu : జే ట్యాక్స్ కి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు… అచ్చెన్నాయుడు..!
Atchannaidu ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి భయపడే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి భయపడే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 13వ స్థానానికి దిగజారిందన్నారు. పారిశ్రామిక రాయితీలు రూ.850 కోట్లు ఇవ్వలేదని, అచ్చెన్న, నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. నాలుగేళ్లలో ఎందుకు ఒక్క సదస్సు జరపలేదు, ఒక్క పరిశ్రమ తేలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
జే ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేస్తున్నారని, కడప ఉక్కుకు శంకుస్థాపనలతో కాలం గడుపుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇక…లోకేష్ పాదయాత్ర సునామీలా కొనసాగుతోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రకు తమకు తామే రక్షణ కల్పించుకుంటామన్నారు. వాస్తవాలు మాట్లాడితే కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.