»Ap Cm Jagan Camp Office Relocated To Vishakha In Dussehra
AP: దసరాకు విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్!
ఏపీలో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని సీఎం క్యాంప్ ఆఫీస్‌ను దసరాకు అమరావతి నుంచి విశాఖకు మార్చుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో రుషికొండలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ పనులు మమ్మురంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
cm jagan camp office relocated to vishakha in dussehra
AP: ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అమారావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. రాజధానిని తరలిస్తున్నాం అని కాకుండా ఉత్తరాంధ్రను అభివద్ధి చేయాలనే దిశగా మకాం మారుస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడటం వల్ల సీనియర్ అధికారులు తరచుగా విశాఖకు రావాల్సి ఉంటుంది. ఈక్రమంలో అధికారులు విశాఖలో ఉండేందుకు ట్రాన్సిట్ వసతి కోసం ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. మంత్రులు, సీనియర్ అధికారులు, సీఎంకు సహాయపడేందుకు మిగతా అధికారులకు కూడా విశాఖలో వసతి ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కల్పించే ఉచిత వసతి సౌకర్యం గడువును కూడా వచ్చే ఏడాది జూన్ 26 వరకు పొడిగించింది.
ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం, గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ తెలిపింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీసు, బస గుర్తింపు కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ , సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులతో కూడిన కమిటీని నియమించింది.
2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు ఉద్యోగులకు ఉచిత వసతి, ట్రాన్సిట్ సదుపాయాలను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ పనులు మమ్మురంగా జరుగుతున్నాయి. వీలైతే ఈ దసరాకే సీఎం క్యాంప్ ఆఫీస్ అమరావతి నుంచి షిఫ్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు కావడంతో.. ఆసమయంలో విశాఖకు వెళతారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి జగన్ విశాఖకు మకాం మార్చేది దసారా తర్వాత? లేకపోతే డిసెంబర్లోనా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.