»Nara Lokesh Who Met The Union Home Minister Amit Shah
Nara Lokesh: కేంద్ర హోం మంత్రిని కలిసిన నారా లోకేష్..వాటిపైనే చర్చ!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బుధవారం సాయంత్రం నారా లోకేష్(Nara Lokesh) కలిశారు. ఆ క్రమంలో తన తండ్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందని షా(amit shah)తో ప్రస్తావించారు. దీంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించినట్లు వెలుగులోకి వచ్చింది.
Nara Lokesh who met the Union Home Minister amit shah
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)తో భేటీ అయ్యారు. ఆ క్రమంలో జైలులో ఉన్న తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షాను కలిసిన అంశాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆ ట్వీట్లో గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి @అమిత్షా జీని కలిసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. అంతేకాదు చంద్రబాబు విషయంలో అధికార పార్టీ ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. దీంతోపాటు నాయుడు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితి గురించి వివరించానని, అతని ప్రాణాలకు ముప్పు ఉన్న జైలులో ఉంచారని లోకేష్ ట్వీట్ చేశారు.
Met with the Hon’ble Union Home Minister @AmitShah Ji and apprised him of the blatant misuse of state machinery by YSRCP Govt in Andhra Pradesh, the regime revenge against Hon’ble @ncbn Garu, and the appalling condition in which he has been lodged in prison where his life is… pic.twitter.com/7vJFAGsdXM
ఈ భేటీ నేపథ్యంలో 73 ఏళ్ల వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని అమిత్ షా అభిప్రాయపడినట్లు లోకేష్ చెప్పారు. చంద్రబాబు(chandrababu) ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారని అన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని షా చెప్పినట్లు లోకేష్ పేర్కొన్నారు. ఈ భేటీలో బీజేపీ(BJP) అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. లోకేశ్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలిశారు. తన తండ్రి అరెస్టుకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సెప్టెంబర్ 11 నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాయుడుకు జ్యుడీషియల్ రిమాండ్ అక్టోబర్ 19 వరకు పొడిగించడం గురించి ప్రస్తావించారు.