Anuty Acid Attack: వివాహేతర సంబంధాలు దాడులకు, హత్యలకు దారితీస్తున్నాయి. అన్నీ తెలిసి, విజ్ఞత ఉన్న వారే ఇలా చేస్తున్నారు. గుంటూరులో ఓ మహిళా ఇలా చేసింది. ఆమె భర్త ఉన్నాడో లేడో కానీ.. ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆ యువకుడు దూరంగా ఉన్నాడు. తననే దూరం పెడతావా అని కోపం పెంచుకుంది.
ఇటీవల వెంకటేష్ (venkatesh) కనిపించాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. వాగ్వివాదం పీక్‌కి చేరింది. వెంకటేష్‌కు (venkatesh) బుద్ది చెప్పాలని అనుకుంది. అప్పటికే తన వెంట యాసిడ్ (acid) తీసుకొని వచ్చింది. దానిని అతనిపై పోసి తన పగను తీర్చుకుంది. అనూహ్య ఘటనతో ఆ యువకుడు తేరుకోలేక పోయాడు చివరికీ ఎలాగోలా తప్పించుకున్నాడు. అయినప్పటికీ భుజం, చేతులపై యాసిడ్ (acid) పడగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
విషయం ఏంటీ అని ఆరా తీస్తే.. కొద్దీరోజులు వారిద్దరూ సహజీవనం చేశారు.. అప్పటివరకు బాగానే ఉంది. తర్వాత వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసింది. అలా రాగా.. వెంకటేశ్ (venkatesh) ఆమె వద్దకు వెళ్లడం లేదు. ప్రియుడి కోసం చూసి.. చూసి.. విసిగి పోయినట్టు ఉంది. తన వద్దకు వస్తావా రావా అని గట్టిగా అడగడంతో.. రానని తెగేసి చెప్పినట్టు ఉన్నాడు. తన వద్ద ఉన్న యాసిడ్ పోసి కోపం చల్లార్చుకుంది.
వివాహేతర సంబంధాలు వద్దు అని.. అవి సమాజంపై ప్రభావం చూపుతాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. కొందరికీ అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ నో యూజ్.. అలా వినడం లేదు. కొనసాగిస్తూ.. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.