Rachakonda SOT police arrested students in LB Nagar smoking of ganja
Arrested: ప్రతి రోజు మత్తుకు బానిస అయిన విద్యార్థులు ఏదో చోట పోలీసులకు పట్టుబడుతున్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా గంజాయి సిగరెట్లు తాగుతున్న ఏడుగురు విద్యార్థులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు విద్యార్థులు ఉంటున్న ఇంటిపై దాడి చేసి గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు. ఎల్బీనగర్లో ఉంటున్న ఆ విద్యార్థులు కరీంనగర్, పెద్దపల్లి, గోదావరి ఖని ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారి వద్ధ నుంచి 3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు గంజాయి సేవిస్తూ, లేదా గంజాయితో పట్టుబడితే వారిపై పెట్టబడే కేసులతో వారి చదువులు, ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుందని, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తమ పిల్లలు చదువుకుంటున్నారు అని వారి తల్లిదండ్రులు పల్లేల్లో కలలు కంటూ ఉంటారు. కాని వీరు మాత్రం ఇక్కడ మత్తులో తూగుతూ తమ భవిష్యత్తును గాల్లో కలుపుకుంటారు. ఈ విషయంలో ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కాని విద్యార్థులు మారడం లేదు. అలా పట్టుబడిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత కూడా వారు మళ్లీ అదే అలవాటుకు గురవుతున్నారని అధికారులు తెలిపారు. మంచి భవిష్యత్తు కోసం కలలు కనే విద్యార్థులు ఎలాంటి చెడు సావాసాలకు వెళ్లోద్దని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఇంట్లో ఉంటున్న పిల్లలపై తల్లిదండ్రలు కూడా ఒక కన్నెేసి ఉండాలని తెలిపారు.