»Telangana Voters List Telangana State Voters List Released Total Voters Count Is Above 3 17 Crores
Voters List: తెలంగాణలో అసెంబ్లీ ఓటర్ల తుది జాబితా విడుదల
తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి. వారిలో పురుషులు కోటి58లక్షల71వేల 493మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కోటి 58లక్షల 43వేల339మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 2557మంది ఓటర్లు. ఓవర్సీస్ ఓటర్లు 2780మంది ఉన్నారు.
Voters List: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. రేపో మాపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను నేడు విడుదల చేసింది. ఈసీ విడుదల చేసిన డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు 13.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగించాలంటూ 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎలక్షన్లు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమీషన్ మూడ్రోజుల పాటు ఎన్నికల సన్నాహక భేటీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి. వారిలో పురుషులు కోటి58లక్షల71వేల 493మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కోటి 58లక్షల 43వేల339మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 2557మంది ఓటర్లు. ఓవర్సీస్ ఓటర్లు 2780మంది ఉన్నారు.
ఇది ఇలా ఉంటే ఓటర్ జాబితా ప్రక్షాలనలో 22,21,68మంది ఓటర్లను తొలగించారు. ఇది ఇలా ఉంటే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడుదల చేయాలని కోరాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు – ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కొనసాగుతుంది. ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటన రేపటితో ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.