బంగ్లదేశ్(Bangladesh)లో డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల్లోనే సుమారు 1000 మందికి పైన మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,006 మంది చనిపోయారని, మరో 20 వేల మంది చికిత్స పొందుతున్నారని ఆ దేశ ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. 2000 సంవత్సరం తర్వాత డెంగూ(Dengue) తో చనిపోయిన వారి సంఖ్యను తీసుకున్నా 2023లోనే ఆ వ్యాధితో మరణించిన వారి సంఖ్య కంటే తక్కువే అంటే తాజా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్టర్ బి నజీర్ తెలిపారు.
రుతుపవనాల్లో వర్షాభావ స్థితి ఏర్పడటం, ఎండలు మండిపోయి ఉష్ణోగ్రతలు (Temperatures) కిందకి దిగి రాకపోవడం డెంగూ వ్యాప్తికి దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువ కనిపించే ఈ వ్యాధి దోమ (Mosquito) ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తీవ్రమైన జ్వరం, తలపోటు, నీరసం, వాంతులు, కండరాల నొప్పి తదితర లక్షణాలు రోగి (Patient) ని ఊపిరిసలపకుండా చేస్తాయి. కొన్ని తీవ్రమైన కేసులలో రక్తస్రావం కూడా జరిగి ప్రాణాలు కోల్పోతారు.
మానవ చర్యల కారణంగా ప్రకృతిలో వస్తున్న విపరీత మార్పుల వల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందే చికెన్‌గున్యా, డెంగూ, ఎల్లో ఫీవర్ (Yellow fever), జికా తదితర వ్యాధుల బారిన ఎక్కువ మంది పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. మానవ చర్యల కారణంగా ప్రకృతి(Nature)లో వస్తున్న విపరీత మార్పుల వల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందే చికెన్‌గున్యా, డెంగూ, ఎల్లో ఫీవర్, జికా తదితర వ్యాధుల బారిన ఎక్కువ మంది పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.