mosquitos : వానలు పడే రోజుల్లో దోమలు సైతం ఎక్కువ అవుతాయి. దీంతో మనం రోజూ ఇంట్లో వీటితో యుద్ధమే చేయాల్సి ఉంటుంది. వీటి కాటు నుంచి తప్పించుకోవడానికి చాలా మంది కాయిల్స్, లిక్విడ్లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి ఆరోగ్యానికి ఏమాత్రమూ మంచివి కావు. మరి దోమలు ఇంట్లోకి చేరకుండా ఉండేందుకు కొన్ని సహజమైన రెమిడీలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. రండి.
మనం దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడుతుంటాం కదా. దాన్ని తీసుకుని సాయంత్రం సమయంలో ఇంటి నలుమూలల్లో పెట్టడండి. ఆ వాసన అంటే దోమలకు(mosquitos) ఇష్టం ఉండదు. కాబట్టి అవి రాకుండా ఉంటాయి. అలాగే వెల్లుల్లిని బాగా దంచి పెట్టుకోండి. ఓ గ్లాసు నీళ్లను పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. అందులో వెల్లుల్లిని వేసి మరిగించడండి. వాటిని వడగట్టి ఇంట్లో అక్కడక్కడా స్ప్రే చేయండి. రాత్రి సమయాల్లో ఇలా చేస్తూ ఉండటం వల్ల దోమలు తగ్గుతాయి.
దోమలు దరి చేరకుండా ఉండాలంటే లావెండర్ నూనె మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ వాసన అంటే వాటికి అస్సలు పడదు. అందుకనే దీన్ని ఇంట్లో అక్కడక్కడా స్ప్రే చేయవచ్చు. ఇంకా అవసరం అయితే చేతులకు, కాళ్లకు కూడా రాసుకోవచ్చు. పుదీనా ఆయిల్ సైతం ఇదే విధంగా ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని సైతం ఇంట్లో అక్కడక్కడా ఉంచుకోవడం వల్లా ప్రయోజనం ఉంటుంది. పుదీనా ఆకుల వాసన ఉన్న చోట దోమలు(mosquitos) తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మలేషియాలోని యూనివర్సిటీ సైన్స్ మలేషియాకు చెందిన వారు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పుదీనా వాసన ఉన్న చోట దోమలు రాకపోవడాన్ని గుర్తించారు.