»Anil Kumar Supporter Has Stabed At Baarashaheed Dargah
kotamreddy vs anil:కోటంరెడ్డి, అనిల్ అనుచరుల గొడవ.. కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరిక
kotamreddy vs anil:నెల్లూరు (nellore) బారషహీద్ దర్గా వద్దకు భక్తులు వస్తుంటారు. ఈ రోజు కూడా రద్దీగా ఉంది. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. కత్తిపోట్లు పొడుచుకోగా.. పోలీసులను మొహరించారు. దర్గా వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
kotamreddy vs anil:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ట్యాపింగ్ ఇష్యూ ఏపీలో ప్రకంపనలు రేపింది. ట్యాపింగ్ అంటూ.. సీఎం జగన్ (jagan), మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై (sajjala ramakrishna reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. నెల్లూరు (nellore) బారషహీద్ దర్గా వద్దకు భక్తులు వస్తుంటారు. ఈ రోజు కూడా రద్దీగా ఉంది. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. కత్తిపోట్లు పొడుచుకోగా.. పోలీసులను మొహరించారు. దర్గా వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
దర్గా (dargah) వద్ద అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు సమీర్ (sameer) కత్తిపోట్లకు గురయ్యారు. వెంటనే అతనిని జీజీహెచ్‌కు (ggh) తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అనిల్ కుమార్ ఆస్పత్రికి (hospital) చేరుకున్నారు. సమీర్‌ను పరామర్శించారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ మధ్య పొసగడం లేదు. వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవీ లభించింది. తర్వాత కాకాణి గోవర్ధన్‌కు మంత్రి పదవీని జగన్ అప్పగించారు. కోటంరెడ్డికి మంత్రి పదవీ వరించలేదు. క్యాబినెట్ హోదా కూడా లభించలేదు. దీంతో విసిగి, వేసారి.. ధిక్కార స్వరం వినిపించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) లక్ష్యంగా విమర్శలు చేశారు. బోరుగంటి అనిల్ (anil) చేత కామెంట్స్ చేయించింది అతనేనని పేర్కొన్నారు. ఎంత దూరం అయినా వెళతానని చెప్పారు. సజ్జల కుమారుడు భార్గవ్ పాత్ర కూడా ఇందులో ఉందన్నారు. ఆయనకు కేటాయించిన గన్ మెన్లను కూడా ప్రభుత్వానికి వెనక్కి పంపించారు. ప్రజలతో ఉంటానని.. తనకు జనమే శ్రీరామ రక్ష అని చెప్పారు.