నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబు నాయుడుకు మద్ధతుగా పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో అక్టోబర్ 24 నుంచి 33 రోజుల పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
nellore rural MLA Kotamreddy Sridhar Reddy Padayatra on october 24th 2023
ఏపీలోని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar Redd) పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ యాత్ర చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అక్టోబర్ 24 నుంచి ఈ పాదయాత్ర మొదలవుతుందని చెప్పారు. ఈ యాత్ర 33 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో లక్ష మందిని కలిసే లక్ష్యంగా పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. లక్ష మంది ప్రజలతో స్థానిక పరిస్థితులు, సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగే ఈ కార్యక్రమానికి మీ అందరి దీవెనెలు కోరుతున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
ఇప్పటికే గతంలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. యువగళం పాదయాత్రకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు భారీ ఏర్పాట్లు చేసి లోకేష్ పాదయాత్ర ఓ వేడుకలా నిర్వహించారు. ఆ క్రమంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఆ క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలన్నింటిపై అక్రమ కేసులు బనాయిస్తోందని.. ఈ కేసులు ఆగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే(MLA) ధీమా వ్యక్తం చేశారు.