»Case Against 16 People Including Mla Kotamreddy And Anam
16 people: ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆనం సహా 16 మందిపై కేసు
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొనొద్దని చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారని పోలీసులు మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Case against 16 people including MLA Kotamreddy and Anam
టీడీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(kotamreddy sridhar reddy), ఆనం రాం నారాయణరెడ్డి(Anam Vivekananda Reddy) సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా బుధవారం నెల్లూరులో నిర్వహించిన ర్యాలీలో వీరు పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నేతలపై చర్యలు తీసుకున్నారు. అయితే ఈ కేసులు నమోదైన వారిలో మాజీ మంత్రి సోమిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, పాశం సునీల్ కుమార్, రామకృష్ణ, కంభం విజయరామిరెడ్డి, కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఎన్.సుబ్రహ్మణ్యం, మాలెపాటి సుబ్బానాయుడు, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, పొలం రెడ్డి దినేష్ రెడ్డి, గుమ్మడి రాజా యాదవ్, వేమిరెడ్డి పట్టాభి రామి రెడ్డి, జనసేన నేత చెన్నారెడ్డి మన్ క్రాంత్ రెడ్డి, సీపీఐ నేత దామ అంకయ్య ఉన్నారు.
ర్యాలీ నిర్వహణకు టీడీపీ(TDP) నేతలు అనుమతి కోరగా పోలీసులు శాంతిభద్రతల నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేదు. ఆ క్రమంలో నిరసనలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా కూడా ర్యాలీని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వీఆర్సీ కూడలి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు శాంతియుత నిరసన చేపట్టారు.