»Amaravati The Capital Of Ap Is The Center Once Again Clarified
Amaravati: ఏపీ రాజధాని అమరావతే..మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతేనని మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో రాజధానులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ల విషయంపై ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో ఏపీ రాజధాని గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజధానిపై కేంద్ర సర్కార్ మరోసారి షాకింగ్ ప్రకటన చేసింది. ఓ వైపు విశాఖ నుంచి పాలన సాగించేందుకు సీఎం జగన్ (CM Jagan) సిద్ధమవుతుంటే కేంద్ర చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. అమరావతి (Amaravati) మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులకు (28 states Capitals) సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తరుణంలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును స్పష్టం చేసింది. దీంతో ఏపీ రాజధానిపై మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.
రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ రాజధానులకు సంబంధించిన ఓ ప్రశ్నను లేవనెత్తారు. దానికి కేంద్రం క్లారిటీ ఇస్తూ సమాధానం చెప్పింది. దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ (Master plans) అనేది లేదన్నది నిజమా కాదా అని ఎంపీ జావెద్ అలీఖాన్ ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి (Amaravati)తో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలిపారు.
అయితే త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా అన్ని రాజధానులకు మాస్టర్ ప్లాన్లను ఆమోదించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. కాగా టీడీపీ (TDP) హయాంలో అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల (3 capitals) విధానాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా త్వరలోనే విశాఖ కేంద్రంగా ఆయన పరిపాలన సాగించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి (Amaravati) శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా వైసీపీ సర్కార్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే.