»Alert For Those Going To Tirumala Permissions For Those Areas Are Cancelled
Tirumala: తిరుమలకు వెళ్లేవారికి అలర్ట్..ఆ ప్రాంతాలకు అనుమతులు రద్దు!
ఆంధ్రప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు సందర్శనీయ ప్రదేశాల్లోకి భక్తుల అనుమతులను రద్దు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆ ప్రాంతాల్లోకి అనుమతులు ఇస్తామని ప్రకటించింది.
మిచౌంగ్ తుఫాన్ వల్ల ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూడు రోజుల నుంచి ఈ తుఫాన్ తీవ్రత అధికంగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో కూడా పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. ఈ తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి అనుమతులను రద్దు చేసింది. భారీ వర్షాలకు తిరుమలలోని ఏఎన్సీ కాటేజ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి.
తిరుమలలోని ఏఎన్సీ వద్ద ఉన్న 412 కాటేజ్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఏఎన్సీ కాటేజ్ వైపు వాహనాలన్నీ రావడం లేదు. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని నేలకొరిగిన భారీ వృక్షాన్ని తొలగించారు. భక్తులెవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తుఫాను వల్ల తిరుమలలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయని, పాపవినాశనం వైపు అయితే చాలా చెట్లు కూలిపోయినట్లు తెలుస్తోంది.
ఈ తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పాపవినాశంకు భక్తుల అనుమతిని రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే తిరుమలలో సందర్శనీయ ప్రదేశాలు అయిన శ్రీపాదాలు, శిలాతోరణం వైపు కూడా భక్తులు వెళ్లడానికి అనుమతిని రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో కపిలతీర్థం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఈ తరుణంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భక్తులను పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అనుమతిని రద్దు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ ప్రాంతాల్లోకి భక్తులను అనుమతిస్తామని తెలిపింది.