ఏపీలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతోంది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర నెంబర్లను ప్రభుత్వం ప్రకటించింది. కుండపోత వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) ప్రభావం భారీగా పెరుగుతోంది. గంటగంటకు వర్షం జోరందుకుంటోంది. కుండపోత వర్షాల (Heavy Rains)కు అన్ని ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచౌంగ్ తుఫాను కదులుతోందని, అది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం నెల్లూరుకు 250 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 380 కలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని, కోస్తా తీరానికి ఈ తుఫాను పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తుఫాన్ తీరం దాటనుందని, ఈ తరుణంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ (Amaravati Weather Department) హెచ్చరికలు జారీ చేసింది.
— Hurricane/Typhoon/Cyclone Updates & Information (@RoshinRowjee) December 4, 2023
మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) వల్ల భారీ ప్రమాదం పొంచి ఉండటంతో కృష్ణా జిల్లాలోని యంత్రాంగం అలర్ట్ అయ్యింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు 08672 252572, 08672 252000 ను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. మరోవైపు తుఫాన్ (Cyclone) నేపథ్యంలో కృష్ణాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సముద్రతీర ప్రాంత మండలాల్లో పలు చర్యలు చేపట్టింది. కుండపోత వర్షాలు, బలమైన గాలులు, వరద ప్రభావం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.