అన్నమయ్య: రాయచోటిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా డైట్ కళాశాలలో విద్యార్థినులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మహిళా భద్రతపై పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.