ప్రకాశం: కనిగిరి పట్టణంలో స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకునే వ్యాపారులు ఆదివారం ఘర్షణ పడ్డారు. కస్టమర్లకు వస్తువులు విక్రయించే క్రమంలో తోటి వ్యాపారులైన చిన్న నారాయణ, వెంకటేశ్వర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. గొడవ పడడంతో వెంకటేశ్వర్లకు గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.