తమిళ బుల్లితెర నటి సుభాషిణి చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడింది. షూటింగ్ కోసం పోరూరులో ఉంటున్న ఆమె ఉరివేసుకుని చనిపోయింది. భర్త బిపిన్ చంద్రతో వీడియో కాల్లో ఉండగా కుటుంబ విషయమై గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.