MLG: ములుగు మున్సిపాలిటీలో 2026-27 ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ టీ. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఈ ఎర్లీబర్డ్ సదుపాయం వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలు ఉన్నవారు ముందుగా వాటిని క్లియర్ చేస్తేనే రాయితీ పొందవచ్చు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.