SKLM: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో జరుగుతున్న శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గ్రామంలో లడ్డు వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన లక్ష్మణరావు గణేష్ లడ్డును రూ.86వేలుకు వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లక్ష్మణరావు దంపతులకు లడ్డును అందజేశారు. అనంతరం వినాయకుడు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు.